Thattukoledhey Song Lyrics in Telugu -Breakup Song Deepthi Sunaina 2021


నా చెయ్యే పట్టుకోవా… నన్నొచ్చి చుట్టుకోవా

నాతోనే ఉండిపోవా… కన్నుల్లో నిండిపోవా

గుండెల్లో పొంగిపోవా… నిలువెల్లా ఇంకిపోవా

ఓ చెలీ కోపంగా చూడకే చూడకే

ఓ చెలీ దూరంగా వెళ్ళకే వెళ్ళకే

నా హృదయమే తట్టుకోలేదే… తట్టుకోలేదే

పట్టనట్టు పక్కనెట్టకే… నా ప్రేమనీ

నా ప్రాణమే తప్పుకోలేదే… తప్పుకోలేదే

అంతలాగా కప్పుకున్నాదే… నీ ఊహానే

నాలో పండగంటే ఏమిటంటే… నిన్ను చూస్తూ ఉండడం

నాలో హాయి అంటే ఏమిటంటే… నీతో నడవడం

నాలో భారమంటే ఏమిటంటే… నువ్వు లేకపోవడం

నాలో మరణమంటే ఏమిటంటే… నిన్ను మరవడం

ఓ చందమామా చందమామా… ఒక్కసారీ రావా

నా జీవితాన మాయమైన… వెన్నెలంత తేవా

మనవి కాస్త ఆలకించి ముడిపడవా

నీ చూపులే అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై

బగ్గుమంటు దూకుతున్నయే నా మీదకి

నా ఊపిరే అందులో పడి కాలుతున్నదే

కొద్దిగైనా కబురుపెట్టు నువ్వు మేఘానికి

నా హృదయమే తట్టుకోలేదే… తట్టుకోలేదే

పట్టనట్టు పక్కనెట్టకే… నా ప్రేమనీ

నా ప్రాణమే తప్పుకోలేదే… తప్పుకోలేదే

అంతలాగా కప్పుకున్నాదే… నీ ఊహానే

నే నిన్ను చూడకుండ… నీ నీడ తాకకుండ

రోజూల నవ్వగలనా

నీపేరు పలకకుండ… కాసేపు తలవకుండ

కాలాన్ని దాటగలనా

గుండెల్లో ఏముందో కళ్ళలో చూడవా

నిన్నలా నాతోనే ఉండవా

నా హృదయమే తట్టుకోలేదే… తట్టుకోలేదే

పట్టనట్టు పక్కనెట్టకే… నా ప్రేమనీ

నా ప్రాణమే తప్పుకోలేదే… తప్పుకోలేదే

అంతలాగా కప్పుకున్నావే నా దారిని

వెళ్లిపోవద్దే… వద్దే వద్దే

వెళ్లిపోవద్దే… వద్దేవద్దే

వెళ్లిపోవద్దే… వద్దేవద్దే

వెళ్లిపోవద్దే… వెళ్లిపోవద్దే

Director: Vinay Shanmukh

Singers: Vijay Bulganin & Sindhuja Srinivasan

Music: Vijay Bulganin

Lyrics: Suresh Banisetti

Casting: Deepthi Sunaina, Rahul Varma