Amma Amma Kanne Puvamma Song Lyrics:-
అమ్మా అమ్మా కన్నె పువ్వమ్మా..
నను నువ్వే విడిచి పోయావేలమ్మా
గుండెల్లోని గాయం చూడమ్మా
నా మానం ప్రాణం నీవేనోయమ్మా
అరె ఆడోళ్ల ప్రేమ ఓ నీటి మూట
మగవాడి ప్రేమ ఓ రాతి కోట
కలలోనైనా నిన్నే తలచేనే
ఆ కలలే రాక మూగైపోయానే
పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే
నా శ్వాసలనన్నీ పట్టుకుపోయావే
మగువను నమ్మి చెడిపోయినోళ్ళు లక్ష
ఆ వరసన నిలిపి నాకు వేసినావే శిక్ష
పాముకాటు వేస్తే మన ఊపిరాగుతుందే
కన్నెప్రేమ కుట్టెనంటే ప్రతిరోజు చంపుతుందే
అరె చేయి విడిచి నువ్వు పోయాక
గుండె మూగదై పోయింది
నిన్ను నమ్మి నీ వెనకొస్తే మనసంతా ఓ పుండైనాది
వలపంటే ఓ ముళ్ళబాటరా
అటు నడిచావంటే అశే తీరదురా
వలపంటే ఓ మత్తుమందురా
అది వేశావంటే ప్రాణం దక్కదురా
అమ్మా అమ్మా కన్నె పువ్వమ్మా
నను నువ్వే విడిచి పోయావేళమ్మా
గుండెల్లోని గాయం చూడమ్మా
నా మానం ప్రాణం నీవేనోయమ్మా
చిల్లులున్న మురళి అరె' పాట పాడగలదు
గుండె గాయమెంతదైనా ప్రేమ బాస మరచిపోదు
ప్రేమ ఉన్నవారు మది వీడి వెళ్ళలేరు
నమ్మి మోసపోతి నేడు ఇది చెప్పలేని గోడు
నను నీటముంచి నీవెళ్ళొద్దే
ఎదుట నిలిచి నను చంపొద్దేే
కంటిచూపులే కరువైతే మరుక్షణమేలే మనదేలే
వన్నెలు చిలికే రామచిలకమ్మా
ఎద గూటిని దాటి పోయావేలమ్మా
ప్రేమే లేని ఊరే యాడున్నా
నా కళ్ళే మూసి తీసుకుపోవమ్మా
అమ్మా అమ్మా కన్నె పువ్వమ్మా
నను నువ్వే విడిచి పోయావేళమ్మ
గుండెల్లోని గాయం చూడమ్మా
నా మానం ప్రాణం నీవేనోయమ్మా
అరె' ఆడోళ్ల ప్రేమ ఓ నీటి మూట
మగవాడి ప్రేమ ఓ రాతి కోట
కలలోనైనా నిన్నే తలచేనే
ఆ కలలే రాక మూగైపోయానే
పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే
నా శ్వాసలనన్నీ పట్టుకుపోయావే....
0 Comments